చెన్నై మార్గంలో భారీగా రైళ్ల రద్దు

by సూర్య | Mon, Nov 22, 2021, 10:59 AM

విజయవాడ డివిజన్‌ పరిధిలోని నెల్లూరు-పడుగుపాడు సెక్షన్‌లో రైలు పట్టాలపై నీళ్లు చేరి ట్రాక్‌ పాక్షికంగా దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో చెన్నై వైపు వెళ్లే పలు రైళ్లు రద్దయ్యాయి. దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌ మరమత్ములు చేపట్టారు. చెన్నై మార్గంలో నడిచే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేయడంతోపాటు మరికొన్నింటిని దారి మళ్లించారు. అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో ప్రత్యేకంగా హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశారు. కావలి, చీరాల, ఒంగోలు స్టేషన్లలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో భోజనం, తాగునీరు అందజేశారు. రద్దయిన రైళ్ల ప్రయాణికుల కోసం అదనంగా రిజర్వేషన్‌ కౌంటర్లు ఏర్పాటు చేసి, టికెట్ల నగదు తిరిగి ఇచ్చారు. సోమవారం నాటికి రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణ దాదాపుగా పూర్తవుతుందని విజయవాడ రైల్వే అధికారులు ఆదివారం తెలిపారు.ఇవీ హెల్ప్‌లైన్‌ నంబర్లు: విజయవాడ: 0866-27678522, 2767055, 2767055


 


నేడు రద్దయిన రైళ్ల వివరాలు: రైలు నంబరు 12707 తిరుపతి-హజ్రత్‌ నిజాముద్దీన్‌, 07657-07658 రేణిగుంట-గుంతకల్‌, నంబరు 22160 చెన్నై-ముంబయి, 12164 చెన్నై సెంట్రల్‌-ఎల్‌టీటీ ముంబయి, 07261 గూడూరు-విజయవాడ, 12709 గూడూరు-సికింద్రాబాద్‌, 12077 చెన్నై సెంట్రల్‌-విజయవాడ, 12743-12744 విజయవాడ-గూడూరు, 17247-17248 నరసాపురం-ధర్మవరం, 17643-17644 కాకినాడ పోర్ట్‌-చెంగలపట్టు, 17249-17250 కాకినాడ టౌన్‌- తిరుపతి, 17210 కాకినాడ టౌన్‌- బెంగళూరు, 12710 సికింద్రాబాద్‌-గూడూరు, 12655 అహ్మదాబాద్‌- చెన్నై సెంట్రల్‌, 06426-06427 నాగర్‌కోయిల్‌-తిరువనంతపురం, 06425 కొల్లం-తిరువనంతపురం, 06435 తిరువనంతపురం-నాగర్‌కోయిల్‌, 12269 చెన్నై సెంట్రల్‌-హజ్రత్‌నిజాముద్దీన్‌, 12842 చెన్నై సెంట్రల్‌- హావ్‌డా(హౌరా), 12656 చెన్నై సెంట్రల్‌-అహ్మదాబాద్‌, 12712 చెన్నై సెంట్రల్‌- విజయవాడ, 12510 గౌహతి-బెంగళూరు, 15930 న్యూతీన్‌సుకియా-తాంబరం.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM