రాడ్లతో దాడి.. ఒకరికి తీవ్రగాయాలు
 

by Suryaa Desk |

అద్దంకి నార్కట్‌పల్లి రోడ్డులో శివారులోని స్థూపం సమీపంలో వ్యక్తిపై నలుగురు వ్యక్తులు ఇనుపరాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన  చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమ్మలచెరువు గ్రామానికి చెందిన షేక్ సైదా ద్విచక్రవాహనంపై పట్టణానికి తిరిగి వస్తున్నాడు. స్థూపం వద్దకు వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన చింతలకాయ శివారెడ్డికి కారులో వచ్చిన మరో ముగ్గురు వ్యక్తులు ద్విచక్రవాహనాన్ని అడ్డగించారు. రోడ్డు పక్కన పడేసిన సైదాపై నలుగురు వ్యక్తులు రాడ్లతో దాడి చేశారు. స్థానికులు గమనించి అడ్డుకోవడంతో వారు అక్కడి నుంచి కారులో పరారయ్యారు. తీవ్ర గాయాలపాలైన అతడిని పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి, ఆస్పత్రికి వెళ్లి దాడి ఘటనపై వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. బాధితురాలితో మాట్లాడి కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

Latest News
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM
ఏపీ కరోనా అప్డేట్ Sat, Nov 27, 2021, 09:13 PM
ఏపీ సీఎం జగన్‌కు లోకేష్‌ లేఖ Sat, Nov 27, 2021, 08:39 PM
ఆటో‌నగర్ లో కల్తీ 'వేప నూనె' గుట్టు రట్టు Sat, Nov 27, 2021, 06:42 PM