పొంచి ఉన్న మరో ముప్పు!

by సూర్య | Mon, Nov 22, 2021, 08:37 AM

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో తమిళనాడు, ఏపీలో భారీ వర్షాలు కురిశాయి. ఇప్పటికే వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గ్రామాల్లోకి నీరు చేరడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో ఏపీ అతలాకుతలం అవుతుండగా మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ అండమాన్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అయితే ఇది కాస్త తగ్గుముఖం పట్టి పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 26 నుంచి డిసెంబర్ 2 వరకు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.నెల్లూరు, కడప, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Latest News

 
వీళ్లా వైఎస్సార్ వారసులు?.. అవినాష్ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు,,,షర్మిల, సునీతలపై సీఎం జగన్ ఫైర్ Thu, Apr 25, 2024, 07:25 PM
తిరుమల శ్రీవారి సేవకులుగా అద్భుత అవకాశం.. భక్తులు వెంటనే బుక్ చేస్కోండి Thu, Apr 25, 2024, 07:21 PM
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం, నిందలు.. సీఎం జగన్‌కు వివేకా భార్య సౌభాగ్యమ్మ లేఖ Thu, Apr 25, 2024, 07:15 PM
వైసీపీ ఎమ్మెల్యే నామినేషన్‌ ర్యాలీలో అపశృతి.. మంటల్లో కాలిపోయిన టీడీపీ కార్యకర్త ఇల్లు Thu, Apr 25, 2024, 07:10 PM
ఏపీలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ.. భారీగా నామపత్రాలు దాఖలు Thu, Apr 25, 2024, 07:06 PM