శబరిమల యాత్ర నిలిపివేత

by సూర్య | Sun, Nov 21, 2021, 08:41 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కేరళలోనూ ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్షాల కారణంగా పంబా నది పొంగిపొర్లుతోంది. దీంతో కక్కి-అనాతోడ్‌ రిజర్వాయర్‌ గేట్లు, పంబా డ్యామ్‌కు వరద నీరు వచ్చి దిగువకు వదులుతున్నారు. దీంతో అధికారులు శబరిమల యాత్రను నిలిపివేశారు. భక్తుల భద్రత దృష్ట్యా పంబ, శబరిమల యాత్రను నిలిపివేస్తూ జిల్లా కలెక్టర్ దివ్య ఎస్ అయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరువళ్లూరు, వెల్లూరు మరియు ఇతర జిల్లాల గుండా నదులు ప్రవహిస్తున్నాయి. చెన్నైలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు కర్ణాటక తీర ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM