న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం

by సూర్య | Sat, Nov 20, 2021, 08:18 AM

 భారత్, న్యూజిలాండ్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే.దీనిలో భాగంగా రాంచీలోని జేఎస్‌సీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ విజేతగా నిలిచింది. భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 153 పరుగుల లక్ష్యాన్ని కివీస్ సునాయాసంగా చేధించింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు శుభారంభం అందించారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ 49 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ 36 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సర్లతో 55 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ 3 వికెట్లు తీశాడు. మిగిలిన వారెవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM