అవసరమైతే తప్పా బయటికి రావొద్దు

by సూర్య | Fri, Nov 19, 2021, 08:29 AM

తిరుపతి నగరంలో ప్రమాదకర పరిస్థితి నెలకొందని అర్బన్ ఎస్పీ తెలిపారు. ఘాట్ రోడ్లపై 13 చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. ఇప్పటికే ఘాట్ రోడ్లు, కాలిబాటలను అధికారులు మూసివేశారు. కపిలతీర్థం ప్రాంతమంతా నీటమునిగింది. దీంతో ఆలయ అనుమతిని నిలిపివేశారు. అదే విధంగా పైభాగంలో ఉన్నవారు కిందకు దిగకుండా, దిగువన ఉన్నవారు పైకి వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. వరద నీరు తగ్గే వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు స్థానికులను హెచ్చరించారు. తిరుమలలో భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తిరుపతికి వచ్చిన వారు పరిస్థితి తెలుసుకుని రాకపోతే ఇబ్బందులు తప్పడం లేదు. 2 రోజుల పాటు తిరుపతికి రాకపోవడమే మంచిదని స్థానికులు చెబుతున్నారు.

Latest News

 
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: లత రెడ్డి Tue, Apr 23, 2024, 01:54 PM
ఉపాధ్యాయులకు సన్మానం Tue, Apr 23, 2024, 12:51 PM
టెన్త్ ఫలితాలలో సత్తా చాటిన గుంటపల్లి హైస్కూల్ Tue, Apr 23, 2024, 12:37 PM
మానవత్వం చాటుకున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ Tue, Apr 23, 2024, 12:36 PM
చంద్రబాబు ని కలిసిన బత్యాల Tue, Apr 23, 2024, 12:33 PM