అక్కడ రేపిస్టులను నపుంసకులుగా మార్చనున్నారు !

by సూర్య | Fri, Nov 19, 2021, 08:07 AM

మహిళలు, చిన్నారులపై పలుమార్లు అత్యాచారాలకు పాల్పడి దోషులుగా తేలిన వారిని పాకిస్థాన్ ప్రభుత్వం కఠినంగా శిక్షించనుంది. రేపిస్టులపై అక్కడి ప్రభుత్వం 'కెమికల్‌ క్యాస్ట్రేషన్' ను ప్రయోగించనుంది. అంటే రసాయనాల సహాయంతో రేపిస్టులను నపుంసకులుగా మార్చనుంది. దీనికి సంబంధించిన బిల్లును తాజాగా పాక్ పార్లమెంట్ ఆమోదించింది. అయితే ఈ బిల్లు ఇస్లామిక్ చట్టాలకు విరుద్ధంగా ఉందని కొందరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రేపిస్టులను బహిరంగంగా ఉరితీయాలని అంటున్నారు. ఈ అత్యాచారం, లైంగిక వేధింపుల కేసుల్లో 4 శాతం కంటే తక్కువ కేసుల్లోనే దోషులకు శిక్ష పడుతుందని విమర్శకులు అంటున్నారు. రసాయనాల సహాయంతో శక్తి తగ్గించే ప్రక్రియను కెమికల్ క్యాస్ట్రేషన్ అంటారు. దక్షిణ కొరియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, యూఎస్‌లోని కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి శిక్ష అమల్లో ఉంది. 2012లో ఇండియాలో సంచలనం సృష్టించిన నిర్భయ ఘటన సమయంలో చర్చ జరిగింది.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM