జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడిన ఏపీ సీఎం
 

by Suryaa Desk |

చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో  వర్షాలు కారణంగా  ఆ  మూడు జిల్లాల కలెక్టర్లతో ఉదయం  మాట్లాడిన సీఎం జగన్ మరోసారి ఫోన్ చేసి తాజా పరిస్థితులను తెలుసుకున్నారు .  రెండ్రోజుల పాటు భారీ వర్షసూచన ఉన్నందున రిజర్వాయర్లలో, చెరువుల్లో ఎప్పటికప్పుడు నీటి మట్టాలను గమనించుకుంటూ తగిన విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు . అవసరమైన ప్రాంతాల్లో తక్షణమే సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలనీ  చెప్పారు . సహాయ శిబిరాల్లో ఉన్న వారికి రూ.1,000 చొప్పున సాయం అందించాలని, వారికి అన్ని రకాల వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు .పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టాలని తెలియచేసారు. తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సహాయక చర్యల కోసం సంబంధిత శాఖలన్నీ వెంటనే కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని చెప్పారు . 

Latest News
అంబులెన్స్​ను ఢీకొట్టిన పలాస ట్రైన్ Sat, Nov 27, 2021, 11:45 PM
తిరుపతిలో చెరువును పరిశీలించిన కేంద్ర బృందం Sat, Nov 27, 2021, 11:40 PM
"మెహంగయి హటావో ర్యాలీ"లో పెద్ద ఎత్తున పాల్గొంటామని కాంగ్రెస్ హామీ Sat, Nov 27, 2021, 11:27 PM
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM