ఘనంగా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా పుట్టినరోజు వేడుకలు..
 

by Suryaa Desk |

నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా ఒకవైపు ప్రజాప్రతినిధిగా, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా క్షణం ఖాళీ లేకుండా గడుపుతారు. మధ్యలో జబర్దస్త్ లాంటి కామెడీ షోకి జడ్జిగా వ్యవహరిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని కూడా పంచుతుంటారు. నిన్న బుధవారం వైసీపీ ఎమ్మెల్యే రోజా సెల్వమణి పుట్టినరోజు సందర్భంగా ఆమె కుటుంబసభ్యులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో 200 కిలోల కేక్ కట్ చేసారు.ఇంకా  రోజా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగరి నియోజకవర్గ స్థాయి గ్రామీణ క్రీడలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులతో పాటు ప్రైజ్ మనీ అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే రోజాకు విద్యార్థులు ధన్యవాదాలు తెలియజేశారు. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని అభిమానులు  అంతా ఆకాంక్షించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆశీర్వాదాలను మ్మెల్యే రోజా తీసుకున్నారు.

Latest News
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM
ఏపీ కరోనా అప్డేట్ Sat, Nov 27, 2021, 09:13 PM
ఏపీ సీఎం జగన్‌కు లోకేష్‌ లేఖ Sat, Nov 27, 2021, 08:39 PM
ఆటో‌నగర్ లో కల్తీ 'వేప నూనె' గుట్టు రట్టు Sat, Nov 27, 2021, 06:42 PM