నేటి నుంచి శ్రీ సత్యసాయి 96 వ జయంతి వేడుకలు ప్రారంభం

by సూర్య | Thu, Nov 18, 2021, 05:26 PM

పుట్టపర్తి : 18 నుండి శ్రీ సత్యసాయి 96 వ జయంతి వేడుకలు ప్రారంభం. భగవాన్ శ్రీ సత్యసాయి 96వ జయంతి వేడుకలు ఈ నెల 18 నుండి ప్రారంభమవుతాయని ట్రస్ట్ వర్గాలు ప్రకటనలో తెలిపారు.అందుకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 18  ఉదయం సాయి సత్యనారాయణ స్వామి వ్రతము, శ్రీ వేణుగోపాల స్వామి రథోత్సవం, తో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. సాయంత్రం జరిగే ప్రత్యేక కార్యక్రమంలో సంగీత విద్వాన్ ప్రసన్నకుమార్ కచేరీ ఉంటుంది. 19న మహిళా దినోత్సవం, బాబా వారి ప్రసంగం దృశ్య రూపకం, మహిళా భక్తుల  ప్రసంగాలు, సాయంత్రం జరిగే కార్యక్రమంలో ప్రియా సిస్టర్స్ భక్తి గీతాలు ఆలపిస్తారు.20 న  ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాయంత్రం రాం ప్రసాద్ సంగీత విభావరి.21 న ఉదయం వేదం, భజనలు, మహా సమాధి దర్శనం, సాయంత్రం శ్రీ గురు చరణ్ సంగీత కచేరి.


22 న శ్రీ సత్య సాయి యూనివర్సిటీ 40వ స్నాతకోత్సవం  ముఖ్యఅతిథిగా  స్వామి చిరకాల భక్తులు   సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ నూతల పాటి వెంకట రమణ గారు  కానున్నారు . ఉదయం 9 గంటలకు  జరిగే కార్యక్రమంలో అత్యున్నత ప్రతిభ కనపరచిన విద్యార్థులకు బంగారు పతకములు మరియు వివిధ  రంగాలలో  అధ్యయనం చేసిన వారికి   డాక్టరేట్   పట్టాలు  ఇవ్వనున్నారు. సాయంత్రం  నిత్యశ్రీ మహదేవన్ భక్తి గీతాలాపన ఉంటుంది. 23 న భగవాన్ శ్రీ సత్య సాయి బాబా 96 వ జన్మదిన వేడుకలు, ఉదయం జరిగే కార్యక్రమంలో విద్యార్థుల గురు వందనం, అనంతరం ట్రస్టు సభ్యులు వార్షిక నివేదిక సమర్పిస్తారు, గ్లోబల్ కౌన్సిల్ వెబ్సైట్ ప్రారంభం, సాయంత్రం జరిగే కార్యక్రమంలో స్వర్ణ రథోత్సవం, ఉయ్యాలో ఉత్సవం, జరుగుతాయి. మల్లాడి బ్రదర్స్ సంగీత కచేరి ఉంటుందని ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా  ఉత్సవాలకు వచ్చే వారికి ప్రశాంతి నిలయం లో గదులు, క్యాంటీన్ సౌకర్యం, షాపింగ్, సౌకర్యాలు లభించవు. తదుపరి ప్రకటన వెలువడే వరకు ఈనెల 30 వరకు ప్రశాంతి నిలయము లో కోవిడ్ ఆంక్షలు కొనసాగుతాయి. ఉత్సవాలకు వచ్చే  వారికి ప్రత్యేకంగా పుట్టపర్తి వాస్తవ్యులు అన్నదాన కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.

Latest News

 
మర్రిపల్లె లో వైసీపీ నుండి టీడీపి లోకి 50 కుటుంబాలు చేరిక Thu, Apr 18, 2024, 02:02 PM
ట్రాక్టర్ ఢీకొని యువకుడికి గాయాలు Thu, Apr 18, 2024, 02:00 PM
జనసేన నుండి వైసీపీలోకి చేరిన కీలక నేతలు Thu, Apr 18, 2024, 01:56 PM
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి Thu, Apr 18, 2024, 01:56 PM
సీఎం జగన్ కి మద్దతు తెలిపిన బ్రహ్మయ్య మాదిగ‌ Thu, Apr 18, 2024, 01:55 PM