ఏపీ మండలి కొత్త ఛైర్మన్ .. వైస్ ఛైర్మన్ ఎంపికకు వారీద్దరి పేర్లు ఖరారు..?

by సూర్య | Thu, Nov 18, 2021, 05:22 PM

ఏపీలో ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 26వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మండలిలో ఇప్పటికే ఎమ్మెల్యే కోటాలో ముగ్గురు నామినేషన్లు వేసారు. ఆ ముగ్గురే నామినేషన్లు దాఖలు చేయటంతో వారి ఎంపిక లాంఛనమే. ఈ సమావేశాల్లోనే కొత్త ఛైర్మన్ ఎన్నిక వైస్ ఛైర్మన్ ఎంపిక జరగనుంది. సీఎం జగన్ ఎస్సీ - బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారని తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న 11 స్థానాలకు వైసీపీ అభ్యర్దులను ఖరారు చేసింది. వారి ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వీరి చేరితో మండలిలో వైసీపీ సంఖ్యా బలం 32 కు చేరుతుంది. ఇక, టీడీపీ హయాంలో ఛైర్మన్ గా పని చేసిన షరీఫ్.. డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం పదవీ విరమణ చేసారు. వారి స్థానంలో ఇప్పుడు వైసీపీ నుంచి కొత్త వారు బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. ఇందు కోసం ముఖ్యమంత్రి జగన్ ఆ రెండు స్థానాల భర్తీకి కసరత్తు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది.

శాసనసభలో స్పీకర్ గా బీసీ వర్గానికి ఇవ్వటంతో..మండలి ఛైర్మన్ పదవి ఎస్సీ వర్గానికి ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా జగన్ పార్టీ ప్రకటన నుంచి మద్దతుగా నిలవటంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తొలి వ్యక్తిగా ఉన్న పశ్చిమ గోదావరికి చెందిన కొయ్యే మోషేన్ రాజు పేరు ఎంపిక చేసినట్లు విశ్వసనీయ సమాచారం. డిప్యూటీ ఛైర్మన్ పదవి బీసీలకు ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందు కోసం బీసీ వర్గానికి చెందిన సీనియర్ నేత జంగా క్రిష్ణమూర్తిని ఎంపిక చేసినట్లు విశ్వసనీయ సమాచారం. జగన్ సీఎం అయిన సమయం నుంచి ప్రతీ ఎంపికలోనూ 50 శాతం ఎస్సీ..బీసీ..మైనార్టీ వర్గాలకు కేటాయిస్తున్నారు. ఇక, ఇప్పుడు ఈ 14 మంది సభ్యుల ప్రమాణ స్వీకారం తరువాత శాసన మండలిలో వైసీపీకి చెందిన 32 మంది సభ్యుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు 18 మంది ఉంటారు. దీని ద్వారా తిరిగి పశ్చిమ గోదావరి జిల్లాకే మండలి ఛైర్మన్... గుంటూరు జిల్లాకు డిప్యూటీ ఛైర్మన్ పదవులు దక్కనున్నాయి అని సమాచారం.

Latest News

 
వైకాపాను వీడి టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 10:16 AM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 10:13 AM
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM