వాయుగుండంగా బలపడి అల్పపీడనం .. నేడు, రేపు గంటకు 45 నుంచి 55 కిమీ వేగంతో గాలులతో అతి భారీ వర్షాలు

by సూర్య | Thu, Nov 18, 2021, 02:59 PM

బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం... రేపు ఉదయం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది.. ఇది పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 290 కిలోమీటర్లు , చెన్నైకి ఆగ్నేయంగా 310 కిలోమీటర్లు, దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రేపు వేకువజామున ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉంది. నేడు, రేపు ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, దక్షిణ కర్ణాటక, పుదుచ్చేరి ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని, పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అదే సమయంలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వివరించింది భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో ఏపీలోని కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో గణనీయంగా వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణ శాఖ పేర్కొంది. కావున తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ స్పష్టం చేసింది.

Latest News

 
ఎన్నికల ప్రక్రియ పై సమీక్ష Sat, Apr 20, 2024, 03:23 PM
సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం Sat, Apr 20, 2024, 02:41 PM
చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపిన మోదీ Sat, Apr 20, 2024, 02:12 PM
పోలీసుల వ్యవహారశైలి బాధాకరం Sat, Apr 20, 2024, 02:11 PM
చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ Sat, Apr 20, 2024, 02:10 PM