తిరుమలలో భారీ వర్షాలు...
 

by Suryaa Desk |

తిరుమలలో నిన్న రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. దర్శనానికి వెళ్లే భక్తులతో పాటు, దర్శనం అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన వారు వర్షంలో తడిసిపోతున్నారు. ఆలయంతో పాటు వీధులు, కాటేజీలు, రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో టీటీడీ భక్తుల భద్రత కోసం టీటీడీ ఇప్పటికే రెండు నడక మార్గాలను మూసివేసింది. ఘాట్ రోడ్లపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడిన చెట్ల కొమ్మలను తొలగించేందుకు టీటీడీ సిబ్బంది, క్రేన్లను సిద్ధంగా ఉంచారు. ఈ వర్షంతో తిరుమలలో చలి తీవ్రత పెరిగింది. మరోవైపు శేషాచల కొండలు పొగమంచుతో కప్పబడి ఉన్నాయి.

Latest News
అంబులెన్స్​ను ఢీకొట్టిన పలాస ట్రైన్ Sat, Nov 27, 2021, 11:45 PM
తిరుపతిలో చెరువును పరిశీలించిన కేంద్ర బృందం Sat, Nov 27, 2021, 11:40 PM
"మెహంగయి హటావో ర్యాలీ"లో పెద్ద ఎత్తున పాల్గొంటామని కాంగ్రెస్ హామీ Sat, Nov 27, 2021, 11:27 PM
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM