తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు కలకలం
 

by Suryaa Desk |

తెలుగు రాష్ట్రాల్లోని మాజీ మావోయిస్టులు, మావోయిస్టు సానుభూతిపరుల ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని మాజీ మావోయిస్టు రవిశర్మ అనురాధ ఇంట్లో సోదాలు జరిగాయి. ప్రకాశం జిల్లాలో విరసం నేత కళ్యాణ్‌రావు ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. మావోయిస్టు పార్టీకి అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న కళ్యాణ్ రావు ఇంటిపై ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు. మరోవైపు విశాఖపట్నంలోని అనురాధ ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. మావోయిస్టులతో సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు ఇటీవలి కాలంలో తాజాగా మావోయిస్టు అగ్రనేత ఆర్కే జీవిత చరిత్రపై పుస్తకాన్ని ప్రచురించే అంశాన్ని ఎన్ఐఏ పరిశీలిస్తున్నట్లు సమాచారం. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసిన రవిశర్మ ఇటీవల లొంగిపోయారు. ఆయన నివాసంలో కూడా సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.

Latest News
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM
ఏపీ కరోనా అప్డేట్ Sat, Nov 27, 2021, 09:13 PM
ఏపీ సీఎం జగన్‌కు లోకేష్‌ లేఖ Sat, Nov 27, 2021, 08:39 PM
ఆటో‌నగర్ లో కల్తీ 'వేప నూనె' గుట్టు రట్టు Sat, Nov 27, 2021, 06:42 PM