వైద్య ఆరోగ్యశాఖలో 10,865 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు

by సూర్య | Thu, Nov 18, 2021, 10:00 AM

వైద్య ఆరోగ్య శాఖలో గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున ఖాళీలను సృష్టించి భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొత్తం 10,865 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీటిలో ప్రస్తుతం 7,390 ఖాళీగా ఉండగా, కొత్తగా సృష్టించినవి 3,475. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ (ఏపీవీవీపీ), పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముద్దాడ రవిచంద్ర బుధవారం ఆదేశాలు జారీ చేశారు. డీఎంఈ ఆధ్వర్యంలోని 15 మెడికల్ కాలేజీల్లో వాటికి అనుబంధంగా ఉన్న 35 ఆసుపత్రుల్లో 1,952 పోస్టులు ఖాళీగా ఉండగా 2,190 పోస్టులు సృష్టించారు. ఏపీవీవీపీ కింద 2,520 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో ఖాళీగా ఉన్న 2,918 పోస్టుల్లో 1,285 పోస్టులు సృష్టించారు. బోధనాసుపత్రుల్లోని అనేక విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ఖాళీల కారణంగా నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసి) నిబంధనల అమలుకు ఆటంకం ఏర్పడింది. బోధనాసుపత్రుల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పనతో పాటు వివిధ విభాగాలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఖాళీ పోస్టులతో పాటు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని సృష్టించే పోస్టులను కూడా ఒకేసారి భర్తీ చేయనున్నారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM