మరో నూతన ఆవిష్కరణ... టిక్‌టాక్‌ వీడియో లాగానే ఇంటర్వ్యూ రెస్యూమ్..

by సూర్య | Wed, Nov 17, 2021, 07:04 PM

ఉద్యోగార్థుల కోసం  హాట్‌మెయిల్‌ వ్యవస్థాపకుడు సబీర్‌ భాటియా మరో కొత్త రకం సేవలతో మన ముందుకొచ్చారు. దాని పేరే 'షోరీల్‌' "Show Reel" టిక్‌టాక్‌ తరహాలో పనిచేసే ఈ 'సోషల్‌ వీడియో మెసేజింగ్‌ ప్లాట్‌ఫాం'ను ఉద్యోగార్థులను లక్ష్యంగా చేసుకొని రూపొందించారు. ప్రముఖంగా షోరీల్‌.. 'రెజ్యుమ్‌' నిర్మాణంలో ఉపయోగపడుతుంది. అయితే, అది వీడియో రూపంలో రూపొందించడమే దీని ప్రత్యేకత. ఇంటర్వ్యూల్లో సాధారణంగా అడిగే ప్రశ్నలు ముందే యాప్‌లో ఉంటాయి. వాటికి జవాబులు చెబుతూ వీడియో రికార్డ్‌ చేయాలి. ప్రశ్నలన్నీ పూర్తయ్యాక వాటన్నింటినీ కలిపి ఓ పూర్తిస్థాయి వీడియోని రూపొందించాలి. అదే మీ వీడియో రెజ్యుమ్‌. టిక్‌టాక్‌ తరహాలో మీరు కావాలంటే ఇతరుల వీడియో రెజ్యుమ్‌లను కూడా చూడొచ్చు. పైగా మన రెజ్యుమ్‌కి క్యూఆర్‌ కోడ్‌ని కూడా జతచేయొచ్చు. దాన్ని స్కాన్‌ చేయగానే మీ రెజ్యుమ్‌ ఉన్న షోరీల్‌ వీడియో ప్లే అవుతుంది.

షోరీల్‌లో ప్రస్తుతం ప్రొఫెషనల్‌, పర్సనల్‌, స్టార్టప్‌, లీడర్‌షిప్‌ అనే నాలుగు విభాగాల్లో మాత్రమే ప్రశ్నలు ఉన్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు సబీర్‌ భాటియా తెలిపారు. వాటన్నింటినీ షోరీల్‌ వేదికపై తీసుకురావాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది చివరికి ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. అయితే, అవి ఏయే కంపెనీలన్నది మాత్రం వెల్లడించలేదు. ఒకసారి ఈ వేదికపైకి వచ్చిన తర్వాత కంపెనీలు వారి అవసరానికి అనుగుణంగా అభ్యర్థులకు ప్రశ్నలు సంధించొచ్చని తెలిపారు. సరైన అభ్యర్థుల ఎంపికకు పేపర్‌ కంటే వీడియో రెజ్యుమ్‌లే ఉపయోగకరంగా ఉంటాయని సబీర్‌ భాటియా అభిప్రాయపడ్డారు. అయితే, వీడియోల్లో అభ్యర్థులు నేరుగా కనిపించడం వల్ల కొంత పక్షపాతం కూడా ఉండే అవకాశం లేకపోలేదన్నారు. అలాంటి వారి కోసం వీడియో కాకుండా కేవలం ఆడియో ద్వారానే జబాబులు చెప్పొచ్చన్నారు. అందుకనుగుణంగా షోరీల్‌లో ఏర్పాట్లు చేశామని తెలిపారు. వీడియో రెజ్యుమ్‌ల వల్ల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సమయం తగ్గుతుందని సబీర్‌ భాటియా తెలిపారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM