రేపే ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. అలా చేస్తే బాయ్ కాట్ చేసే ఆలోచనలో టీడీపీ
 

by Suryaa Desk |

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముహూర్తం కుదిరింది. కరోనా వైరస్ ప్రొటోకాల్స్ మధ్య ఈ సమావేశాలు ఆరంభమౌతాయి.ు. ఆరునెలల విరామం తర్వాత అసెంబ్లీ జరగనుండటంతో పలు కీలక ఆర్డినెన్సులను ఆమోదించాలని సభ ముందుకు ప్రభుత్వం తీసుకురానుంది. అయితే ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయన్న విషయంపై స్పష్టత లేదు. ఒక్క రోజు మాత్రమే సభ నిర్వహిస్తే నిరసనగా బాయ్ కాట్ చేసే ఆలోచనలో టీడీపీ ఉంది అని సమాచారం. ఏపీ సీఎం జగన్  ఆరు రోజుల పాటు కొనసాగించడానికి మొగ్గు చూపారని సమాచారం. ఈ ఏడాది జులై నుంచి ఇప్పటివరకు వివిధ శాఖలకు సంబంధించి ప్రభుత్వం 14 ఆర్డినెన్సులను జారీ చేసింది. ఒకేరోజున 14 ఆర్డినెన్స్‌లను శాసనసభ, శాసన మండలి ఆమోదించేలా ప్రభుత్వం ప్లాన్‌ చేస్తోంది. అయితే 15 రోజుల సభ నిర్వహణపై బీఏసీలో గట్టిగా డిమాండ్ చేయాలని టీడీపీ భావిస్తోంది.

Latest News
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM
ఏపీ కరోనా అప్డేట్ Sat, Nov 27, 2021, 09:13 PM
ఏపీ సీఎం జగన్‌కు లోకేష్‌ లేఖ Sat, Nov 27, 2021, 08:39 PM
ఆటో‌నగర్ లో కల్తీ 'వేప నూనె' గుట్టు రట్టు Sat, Nov 27, 2021, 06:42 PM