నెల్లూరులో వార్‌ వన్‌ సైడ్.. వైసిపి విజయకేతనం..
 

by Suryaa Desk |

ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది.. దానితో వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి…  నెల్లూరు కార్పొరేషన్ లోనూ మెజారిటీ స్థానాలను గెలిచి.. దానిని తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 20 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో 24 డివిజన్లలో ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 54 వార్డులకుగానూ 8 డివిజన్లలో అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. మరో 46 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి. 52 వార్డులు వైసీపీ ఖాతాలో పడ్డాయి. దీంతో నెల్లూరు కార్పొరేషన్ కూడా వైసీపీ కైవసం కావడం లాంఛనమే అయింది. ఇక మరోవైపు అధికార పార్టీ 9 మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకుంది. కుప్పం, నెల్లూరు, ఆకివీడు, పెనుకొండ, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, గురజాల, బుచ్చిరెడ్డిపాలెం, దాచేపల్లిలో జయకేతనం ఎగురవేసింది.

Latest News
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM
ఏపీ కరోనా అప్డేట్ Sat, Nov 27, 2021, 09:13 PM
ఏపీ సీఎం జగన్‌కు లోకేష్‌ లేఖ Sat, Nov 27, 2021, 08:39 PM
ఆటో‌నగర్ లో కల్తీ 'వేప నూనె' గుట్టు రట్టు Sat, Nov 27, 2021, 06:42 PM