కేరళను టెన్షన్ పెడుతున్న ‘నోరో వైరస్‌’

by సూర్య | Wed, Nov 17, 2021, 09:10 AM

కేరళను టెన్షన్ పెడుతున్న నోరో వైరస్‌’. కేరళలో మరో కొత్త వైరస్ బయటపడింది. ‘నోరో వైరస్‌’ అనే ఈ వ్యాధిని వయనాడ్‌ జిల్లాలోని ఓ పశువైద్య కళాశాల చెందిన 13 మంది విద్యార్థుల్లో రెండు వారాల కిందట గుర్తించారు. వాంతులు, విరేచనాలకు కారణమయ్యే ఈ ‘నోరో వైరస్‌’ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ప్రజలకు సూచించింది. విద్యార్థుల రక్తనమూనాలను సేకరించి అలప్పుజలోని జాతీయ వైరాలజీ సంస్థ (ఎన్ఐవీ)కి పంపించింది. ఈ మేరకు అధికారులతో సమావేశమైన కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్‌.. వైరస్‌ వివరాలు తెలుసుకొని వ్యాప్తిని అడ్డుకునే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తాగునీటి వనరులను ఇప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచించారు.


 


 

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM