ఎర్ర గంగిరెడ్డి బెయిలు రద్దు పిటిషన్‌పై వాయిదా
 

by Suryaa Desk |

 కడప జిల్లా పులివెందులకు చెందిన మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిలు రద్దు పిటిషన్‌పై విచారణ ఈనెల 19కి వాయిదా పడింది. కడప సబ్‌కోర్టులో ఈమధ్య సీబీఐ అధికారులు ఎర్ర గంగిరెడ్డి బెయిలు రద్దు కోరుతూ పిటిషన్‌ దాఖలు వేశారు . అయితే ఆ  పిటిషన్‌పై మంగళవారం సబ్‌కోర్టులో విచారణకు వచ్చింది. నిందితుడి తరఫు న్యాయవాది కౌంటర్‌ దాఖలు వేయడానికి న్యాయస్థానం అవకాశం ఇస్తూ  ఈనెల 19కి విచారణ వాయిదా వేసింది. వివేకా హత్యకేసులో ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరిలను నిందితులుగా చేరుస్తూ సీబీఐ గత నెల 26న పులివెందుల కోర్టులో ప్రలిమినరీ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది.

Latest News
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM
ఏపీ కరోనా అప్డేట్ Sat, Nov 27, 2021, 09:13 PM
ఏపీ సీఎం జగన్‌కు లోకేష్‌ లేఖ Sat, Nov 27, 2021, 08:39 PM
ఆటో‌నగర్ లో కల్తీ 'వేప నూనె' గుట్టు రట్టు Sat, Nov 27, 2021, 06:42 PM