కర్నూలు న్యాయను రాజధానిగా చేయాలి
 

by Suryaa Desk |

రాయలసీమ విద్యార్థి  యువజన సంఘాల జేఏసీ తో కర్నూలు జిల్లా లో న్యాయ రాజధానికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వంతో ప్రకటన చేయించాలని డిమాండ్ చేస్తూ..ఆందోళనకు దిగారు .  కర్నూలు జిల్లా బీజేపీ కార్యాలయాన్ని చుట్టూముట్టెందుకు ప్రయత్నించారు. దాంతో రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు .అపుడు  విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర బీజేపీ పార్టీ రాయలసీమ డిక్లరేషన్ పేరుతో సీమను నయవంచనకు గురిచేస్తోందని చెప్పారు. కర్నూలు జిల్లా లో హైకోర్టు ఏర్పాటుకు అనుకూలమని ప్రకటించిన బీజేపీ.. అమరావతి రాజధాని కావాలనడంపై మండిపడ్డారు. బీజేపీకి రాయలసీమ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాయలసీమ ప్రాంతాన్ని పారిశ్రామిక కారిడార్‌గా గుర్తించాలని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం నుంచి కర్నూలులో న్యాయ రాజధానికి అనుకూలమని ప్రకటన చేయించాలని వారు  డిమాండ్ చేశారు.

Latest News
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM
ఏపీ కరోనా అప్డేట్ Sat, Nov 27, 2021, 09:13 PM
ఏపీ సీఎం జగన్‌కు లోకేష్‌ లేఖ Sat, Nov 27, 2021, 08:39 PM
ఆటో‌నగర్ లో కల్తీ 'వేప నూనె' గుట్టు రట్టు Sat, Nov 27, 2021, 06:42 PM