రైతన్నలకు తీపి కబురు.. ఖాతాలోకి నష్ట పరిహారం: ఏపీ సీఎం జగన్
 

by Suryaa Desk |

ఏపీ లోని జగన్ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింద. మంగళవారం నాడు ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఈ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి రైతుల ఖాతాలో జమ చేసారు  సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి.
ఆంధ్రప్రదేశ్లో తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించే పనిలో పడింది . ప్రకృతి విపత్తుల వల్ల, అకాల వర్షాల వల్ల నష్టం జరిగిన రైతులకు బాసటగా నిలవాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో వచ్చిన గులాబ్‌ సైక్లోన్‌ చాలా భీభస్తమ్ సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ సైక్లోన్‌ వల్ల 34,586 మంది రైతులు పంట నష్టపోయారు. అయితే ఆ రైతుల ఖాతాల్లోకి 22 కోట్ల రూపాయల పంట నష్ట పరిహారం అందించనుంది జగన్ సర్కార్. రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌. ఈ క్రాప్‌ ఆధారంగా నమోదైన రైతులకు పంట నష్టపరిహారం పంపిణీ చేస్తున్నారు. అయితే జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు పంట నష్టపరిహారం క్రింద 13.96 లక్షల మంది రైతులకు అందించిన ఇన్‌పుట్‌ సబ్సిడీ సాయం రూ. 1,071 కోట్లుగా ఉంది. సచివాలయాలలో జాబితాలను ప్రదర్శించి రైతులకు నష్ట పరిహారాన్ని పంపిణీ చేస్తున్నారు.ఇక గత రెండు వారాలుగా పడుతున్న వర్షాలతో జరిగిన నష్టాన్ని కూడా అంచనా వేయడానికి క్షేత్రస్థాయిలో ఇప్పటికే బృందాలను రంగంలోకి దించిన ఏపీ సర్కార్ రైతులకు అండగా ఉండటం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.

Latest News
అంబులెన్స్​ను ఢీకొట్టిన పలాస ట్రైన్ Sat, Nov 27, 2021, 11:45 PM
తిరుపతిలో చెరువును పరిశీలించిన కేంద్ర బృందం Sat, Nov 27, 2021, 11:40 PM
"మెహంగయి హటావో ర్యాలీ"లో పెద్ద ఎత్తున పాల్గొంటామని కాంగ్రెస్ హామీ Sat, Nov 27, 2021, 11:27 PM
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM