ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

by సూర్య | Wed, Oct 27, 2021, 07:40 AM

టీడీపీ కార్యాలయం విధ్వంసం కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ సక్రు నాయక్‌ పై దాడి కేసులో నిందితులకు 41 ఏ నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ఆ సెక్షన్‌ ప్రకారం నోటీసులిచ్చి విచారణ జరిపాలని మంగళగిరి పోలీసులను హైకోర్టు ఆదేశించింది. వీఆర్వో ఫిర్యాదుపై నమోదైన కేసులోనూ 41ఏ నోటీసులు ఇవ్వాలని సూచించింది. తెనాలి శ్రవణ్‌, పోతినేని శ్రీనివాసరావుపై కులం పేరుతో దూషించారని కేసు నమోదు అయ్యింది. గంజి చిరంజీవి, మరో 10 మంది రాస్తారోకో చేశారని వీఆర్వో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వీటికి సంబంధించిన కేసుల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Latest News

 
ప్రచారంలో అపశ్రుతి.. ఆవేశంగా ప్రసంగిస్తూ కిందపడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి Tue, Apr 16, 2024, 08:20 PM
ఏపీలో పెరిగిన ఎండల తీవ్రత, వేడిగాలులు.. ఈ జిల్లాల ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక Tue, Apr 16, 2024, 08:14 PM
సీఎం జగన్‌పై దాడి కేసు.. రాయి విసిరిన యువకుడి గుర్తింపు Tue, Apr 16, 2024, 08:08 PM
కర్నూలు ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్.. పూర్తి ఫ్రీగా. Tue, Apr 16, 2024, 07:36 PM
ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణశాఖ చల్లని కబురు Tue, Apr 16, 2024, 07:31 PM