ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం: జగన్

by సూర్య | Tue, Oct 26, 2021, 12:51 PM

రైతులకు సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నూటికి నూరుశాతం అమలు చేస్తున్నామని, ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌ రైతు భరోసా, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రైతులకు సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం అమలు చేస్తున్నామన్నారు.''గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రాయితీ బకాయిలు రూ.1,180 కోట్లు ఈ ప్రభుత్వం చెల్లించింది. కరువుసీమలో కూడా నేడు పుష్కలంగా సాగునీరు అందుతోంది. కరోనా సవాల్‌ విసిరినా కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. రూ.2,134 కోట్ల వ్యయంతో యంత్రసేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. 29 నెలల పాలనలో అనేక మార్పులు తీసుకొచ్చాం. వ్యవసాయ సలహా మండళ్లు ఏర్పాటు చేశాం. ఈ-క్రాపింగ్‌ నమోదు ద్వారా వ్యవసాయ పథకాలు అమలు చేస్తున్నామని'' సీఎం అన్నారు.రైతులకు కనీస మద్దతు ధర అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కల్తీ విత్తనాలు అరికట్టేందుకు కఠినచర్యలు తీసుకుంటున్నాం. రైతులకు పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నాం. నాణ్యమైన కరెంటు సరాఫరాకు రూ.18వేల కోట్ల వ్యయం అవుతోంది. విద్యుత్‌ సరఫరా కోసం రూ.1700 కోట్లతో ఫిడర్ల మార్పు చేశాం. రూ.3వేల కోట్ల వ్యయంతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణకు రూ.2వేల కోట్లతో నిధి ఏర్పాటు చేశాం. రైతుకు అన్ని సమయాల్లో అండగా నిలవడమే ప్రభుత్వం లక్ష్యమని సీఎం జగన్‌ అన్నారు.ధాన్యం సేకరణకు రెండేళ్లలో రూ.35 వేలకోట్లు ఖర్చు చేశాం. పత్తిపంట కొనుగోలుకు రూ.1800 కోట్ల ఖర్చు చేశాం. ఇతర పంటల కొనుగోలుకు రూ.6,434 కోట్ల వ్యయం చేశామని సీఎం జగన్‌ అన్నారు.


 

Latest News

 
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM
ఏపీలో వేలసంఖ్యలో వాలంటీర్ల రాజీనామాలు Wed, Apr 24, 2024, 08:57 PM
రఘురామ కృష్ణంరాజుపై దాడి అమానుషం Wed, Apr 24, 2024, 08:51 PM
నేను ఎదిగింది ఇలానే Wed, Apr 24, 2024, 08:50 PM
మండిపోతున్న ఎండలు.. ఈ జిల్లాలవాసులకు అలర్ట్ Wed, Apr 24, 2024, 08:50 PM