ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి రేషన్‌ దుకాణాలు బంద్‌

by సూర్య | Tue, Oct 26, 2021, 12:31 PM

ఏపీలో ఇవాళ్టి నుంచి రేషన్‌ దిగుమతి, పంపిణీ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది రేషన్‌ డీలర్ల సంఘం. 2020 పీఎంజీకేవై కమీషన్ బకాయిలు తక్షణమే చెల్లించాలని అలాగే... డీడీ నగదు వాపసు, ధరల వ్యత్యాస సర్క్యులర్లను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. డీలర్ల నుంచి ఐసీడీఎస్‌కు మళ్ళించిన కందిపప్పుకు సంబంధించిన బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరారు డీలర్లు.2020 మార్చి 29 నుంచి ఇప్పటి వరకు ఏపీ పౌరసరఫరాల కార్పొరేషన్ నుంచి డీలర్లకు రావాల్సిన కమీషన్ బకాయిలు చెల్లించాలన్నారు. గోనె సంచులను ప్రభుత్వానికి తిరిగిస్తే 20 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు చెల్లింపు చేయమని చెప్పడం సరైంది కాదంటున్నారు డీలర్లు.గోనె సంచులు తిరిగి ఇవ్వకుంటే ఎలాట్‌మెంట్‌ కట్ చేసి కేసులు పెడతామని హెచ్చరించడంపై భగ్గుమంటున్నారు. గోనె సంచులు ప్రభుత్వం తీసుకునేలా ఇచ్చిన జీవో 10ని పక్క రాష్ట్రం తెలంగాణలో అమలు చేస్తున్నారని డీలర్లు గుర్తుచేశారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా నడురబడంలో ప్రభుత్వ ఉద్యోగులపై కారం చల్లి వీరంగం సృష్టించింది మహిళా రేషన్‌ డీలర్‌. రేషన్ డిపో స్వాధీనం చేసుకోవడానికి వచ్చిన వారిపై దాడి చేసింది డీలర్‌ జ్యోతి. సచివాలయ మహిళా పోలీస్ ఇతర ఉద్యోగుల కళ్లల్లో కారం కొట్టింది. RDOసింధు, DSP బాలచంద్రారెడ్డి సమక్షంలోనే ఇదంతా జరిగింది. ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. రేషన్‌ డీలర్ల ఆందోళనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తోందో చూడాలి.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM