ఒత్తిడి ఎక్కువైందా..?

by సూర్య | Tue, Oct 26, 2021, 11:46 AM

ఎంత నేర్పుగా.. ఎంత పద్ధతిగా ఉన్నా.. కొన్ని పరిస్థితులు మూడ్ చెడగొడతాయి. ఒక్కసారిగా కుంగిపోతారు. బాధపడతారు. అదంతా మరిచి మళ్లీ వర్క్‌లో పడ్డానికి చాలా టైం పడుతుంది. ముఖ్యంగా ఆడవాళ్లకు బోలెడన్నీ పనులుంటాయి. అలాంటి సమయాల్లో ఆ ఒత్తిడిని కచ్చితంగా జయించాలి. కొన్ని టిప్స్‌తో పరిస్థితిని ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు. మూడ్ చెడిపోయినప్పుడు ఇష్టమైన ప్రదేశాలను ఊహించుకోవాలి. అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తారో ఊహించుకుంటూ స్వాంతన పొందవచ్చు. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని పలు అధ్యయనాల్లో కూడా తేలింది. ఎవరితోనైనా ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత చల్లటి నీళ్లతో స్నానం చేయాలి. ఆ తర్వాత నచ్చిన ఫుడ్ తినాలి. దీంతో ఒత్తిడి ఇట్టే తగ్గిపోతుందంట. దీంతోపాటు ఏదైనా సినిమా చూస్తే జరిగిన విషయాన్ని మరిచిపోయి.. నార్మల్ మూడ్‌కు వచ్చేస్తారు. ఎక్కడైనా పొరపాటు జరిగితే.. దానికి కారణమైన వ్యక్తితో గొడవలు పడకుండా.. మాట్లడ్డానికి ట్రై చేయాలి. ఇగోను పక్కన పెట్టి.. జరిగిన విషయంపై వీలైనంత డిస్కషన్ చేయాలి. అవతల వ్యక్తి కోణంలో ఆలోచించగలగాలి. అప్పుడు సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇవి పాటిస్తే.. చాలు జీవితంలో ఎంత కష్టమైన సందర్భంలోనైనా ఆందోళన చెందకుండా హాయిగా ఉండొచ్చు.

Latest News

 
కొల్లేరుకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం Fri, Mar 29, 2024, 11:11 AM
చంద్రబాబుపై మండిపడ్డ సీఎం జగన్ Fri, Mar 29, 2024, 11:07 AM
నేటి వైసీపీ బస్సు యాత్ర వివరాలని అందించిన తలశిల రఘురాం Fri, Mar 29, 2024, 11:07 AM
నేడు కర్నూలు జిల్లాలో జగన్ బస్సు యాత్ర Fri, Mar 29, 2024, 11:06 AM
వైసీపీ పరిపాలనంత దుర్మార్గపు పాలన Fri, Mar 29, 2024, 11:02 AM