వాట్సప్‌లో కొత్తగా 'సెల్ఫ్​ చాట్' ఫీచర్

by సూర్య | Tue, Oct 26, 2021, 11:41 AM

వాట్సప్‌  ఓ కొత్త ఫీచర్​ను పరిచయం చేసింది. అదే 'సెల్ఫ్-చాట్' ఫీచర్. ఈ ఫీచర్​ అచ్చం నోట్​పాడ్​లా పనిచేస్తుంది. అంటే, మీ నెలవారీ బిల్లింగ్​లు, చేయాల్సిన పనులు, షాపింగ్​ జాబితా, ఇంపార్టెంట్​ డేట్స్​, మీటింగ్స్​ ఇలా ప్రతిదీ నోట్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. ముఖ్యమైన డాక్యుమెంట్లు, ఫైల్‌లు, ఫోటోలను కూడా ఇలా సేవ్​ చేసుకోవచ్చు. మొబైల్​లో కీలకమైన డాక్యుమెంట్లను పదే పదే సెర్చ్​ చేయాల్సిన అవసరం లేకుండా త్వరగా యాక్సెస్ చేయడానికి కూడా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.మీ మొబైల్‌లో ఏదైనా బ్రౌజర్‌ని ఓపెన్​ చేయండి. అడ్రస్​ బార్​లో దేశం కోడ్ (భారతదేశంలో 91), మీ 10 -అంకెల మొబైల్ నంబర్ తర్వాత wa.me// అని టైప్ చేయండి. ఆ తర్వాత ఎంటర్​పై క్లిక్ చేయండి. మీరు డెస్క్‌టాప్‌ వెర్షన్​ ను ఉపయోగిస్తుంటే, వాట్సాప్​ను ఓపెన్​ చేయమని అడిగే ప్రాంప్ట్ విండో కనిపిస్తుంది. తర్వాత 'కంటిన్యూ టు చాట్​' ఆప్షన్‌పై క్లిక్ చేయండి. డౌన్​లోడ్​ వాట్సాప్​ లేదా వాట్సాప్​ వెబ్​ అనే రెండు ఆప్షన్లతో కూడిన కొత్త విండో ఓపెన్​ అవుతుంది.ఒకవేళ మీ ల్యాప్​టాప్​లో వాట్సాప్​ యాప్​ లేకపోతే డౌన్​లోడ్​ చేసుకోండి. లేదా వాట్సాప్​ వెబ్​ను ఎంచుకోండి. ఆ తర్వాత సెల్ఫ్ ​చాట్​ ఫీచర్​ను ప్రారంభించవచ్చు. తద్వారా మీతో మీరే చాట్ చేసుకోవచ్చు. మొబైల్ యూజర్ల విషయంలో వాట్సాప్ చాట్‌ ఆటోమేటిక్​గా ఓపెన్​ అవుతుంది. పైన మొబైల్​ నంబర్, ప్రొఫైల్ పిక్చర్​ డిస్​ ప్లే అవుతాయి.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM