ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

by సూర్య | Tue, Oct 26, 2021, 08:07 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్నటివరకు పెరిగిన కరోనా మహమ్మారి కేసులు ఇప్పుడు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న 400కు పైగా కరుణ కేసులు నమోదు కాగా ఇవ్వాళ ఆ సంఖ్య 200కు పడిపోయింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 295 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,63,872కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో 07 గురు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14,350కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 27, 641 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2,92,91,896 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4830 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 560 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,44,692 లక్షలకు చేరింది.

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM