మొలకెత్తిన పెసర్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది

by సూర్య | Mon, Oct 25, 2021, 04:15 PM

మొలకెత్తిన పెసర గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇవి చాలా రకాల వ్యాధులను దూరం చేస్తాయి. విటమిన్ సి అధికంగా ఉండే ఈ పెసర మొలకలను ప్రతి రోజూ తీసుకోవడం ద్వారా రోగనిరోధకశక్తిని పెరుగుతుంది. మన శరీరానికి ఎటువంటి అంటు వ్యాధులు రాకుండా కాపాడుతుంది. పెసర గింజలలో అధికభాగం ఫైబర్ ఉండటం వల్ల మన శరీరంలో జీర్ణక్రియ రేటు మెరుగుపరుస్తుంది.మధుమేహ వ్యాధిగ్రస్తులకు మొలకెత్తిన పెసర్లు చాలా మంచిది. సర్వరోగ నివారిణి అని చెప్పవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేయగల సామర్థ్యం వీటికి ఉంది.గుండె జబ్బుల నుంచి దూరంగా ఉండాలంటే మొలకెత్తిన పెసర్లు చాలా ముఖ్యం. ప్రతిరోజు గుప్పెడు తింటే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.వివాహితులు మొలకెత్తిన పెసర్లను తింటే సంతానోత్పత్తికి ఉపయోగపడుతుంది. శరీర లోపలి భాగాలను శక్తివంతం చేస్తుంది.మొలకెత్తిన పెసర్లు గర్భిణీలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. గర్భధారణ సమయంలో మహిళల శరీరానికి ఫోలేట్ అవసరం. ఇది తల్లి కడుపు లోపల బిడ్డను అభివృద్ధి చేయడానికి పనిచేస్తుంది.మొలకెత్తిన పెసర్లు బరువ తగ్గడానికి తోడ్పడుతాయి. శరీరంలో కొవ్వు పెరగకుండా చేస్తుంది. ఎక్కువ సమయం ఆకలి కాకుడా చూస్తుంది. దీని కారణంగా అధిక ఆహారాన్ని తినలేము. బరువును అదుపులో ఉంచుకోవచ్చు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM