తెలుగు రాష్ట్రాల్లో నడిచే దీపావళి ప్రత్యేక రైళ్ల వివరాలు

by సూర్య | Sat, Oct 23, 2021, 05:26 PM

రైల్వే ప్రయాణీకులకు మరో గుడ్ న్యూస్. దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల మీదుగా దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనుంది. విశాఖపట్నం - సికింద్రాబాద్, విశాఖపట్నం - తిరుపతి మధ్య ప్రత్యేక వీక్లీ రైళ్లను నడపనుంది. ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన రిజర్వేషన్లను రైల్వే శాఖ ప్రారంభించింది. నవంబరు 2న (మంగళవారం) సాయంత్రం 5.35 గం.లకు విశాఖపట్నం నుంచి బయలుదేరనున్న ప్రత్యేక రైలు(నెం.08585) మరుసటి రోజు(బుధవారం) ఉదయం 07.10 గం.లకు సికింద్రాబాద్ చేరుకోనుంది. అలాగే నవంబరు 3న(బుధవారం) రాత్రి 09.05 గంజలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరనున్న ప్రత్యేక రైలు (నెం.08586) మరుసటి రోజు(గురువారం) ఉదయం 09.50 గం.లకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ రైల్వే స్టేషన్లలో ఆగనుంది. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లో ఉంటాయి.


అలాగే మరో ప్రత్యేక రైలు(నెం.08583) నవంబరు 1న(సోమవారం) సాయంత్రం 07.15 గం.లకు విశాఖపట్నం నుంచి బయలుదేరి మరుసటి రోజు(మంగళవారం) ఉదయం 07.30 గం.లకు తిరుపతి చేరుకోనుంది. అలాగే ప్రత్యేక రైలు(నెం.08584) తిరుపతి నుండి నవంబరు 2న(మంగళవారం) రాత్రి 09.55 గం.లకు బయలుదేరి.. మరుసటి రోజు(బుధవారం) ఉదయం 10.20 గం.లకు విశాఖపట్నం చేరుకోనుంది.ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. ఇందులో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.


అలాగే దీపావళి పండుద దృష్ట్యా టాటా నగర్- కాచిగూడ, యశ్వంత్‌పూర్ - హెచ్.నిజాముద్దీన్ మధ్య రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన రిజర్వేషన్లను రైల్వే శాఖ ఇప్పటికే ప్రారంభించింది.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM