వైసీపీ నేతలపై ఎన్నికల సంఘానికి సోము వీర్రాజు ఫిర్యాదు

by సూర్య | Sat, Oct 23, 2021, 02:54 PM

వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు ఉపఎన్నికకు సంబంధించి పోలింగ్ తేదీ దగ్గరపడే కొద్ది రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఈ ఉపఎన్నికల బరిలో వైసీపీ, కాంగ్రెస్, బీజేపీలు ఉన్నాయి. ఇప్పటికే ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రజలను స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం కల్పించేలా లేదని బీజేపీ పదేపదే ఆరోపిస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే సోము వీర్రాజు శనివారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.


మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలపై ఎన్నికల సంఘానికి బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఫిర్యాదు చేశారు. సీఈవో, ఆర్వోకు శనివారం ఉదయం వినతిపత్రం అందించారు. వైసీపీ నేతలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీకే ఓటు వేయాలంటూ ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలు చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడుతున్నప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.


 


 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM