ఏపీలో మరో కొత్త పథకం

by సూర్య | Sat, Oct 23, 2021, 07:34 AM

ఏపీ సీఎం జగన్ మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. ఏపీలోని నిరుపేద బ్రాహ్మణుల అంత్యక్రియలకు ప్రభుత్వం గరుడ సహాయ పథకం కింద రూ.10వేలు సాయం చేయనుంది. ఈ పథకానికి రూ.75 వేలలోపు వార్షిక ఆదాయం ఉన్నవారు అర్హులు. వ్యక్తి మరణించిన 40 రోజుల లోపు బాధిత కుటుంబాలు అప్లై చేసుకోవాలి. ఈ పథకం కోసం http://andhrabrahmin.ap.gov.in/ వెబ్‌ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ఈ నగదు వ్యవహారాలను చూసుకోనుంది.


అంత్యక్రియల ఖర్చుల పథకానికి దరఖాస్తు చేయాలంటే కుల ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి.


మరణించిన వారి డేత్ సర్టిఫికెట్ ఉండాలి.


కుటుంబ ఆదాయం రూ.75,000/- కంటే ఎక్కువ ఉండకూడదు


మరణించిన వారి గుర్తింపు కార్డులు, దరఖాస్తు చేసే కుటుంబ సభ్యులు గుర్తింపు కార్డులు ఉండాలి.


ఈ దరఖాస్తును పూర్తిగా ఆన్‌లైన్‌లో www.andhrabrahmin.ap.gov.in చేయాల్సి ఉంటుంది.

Latest News

 
గుత్తి ఆటో యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఉచితంగా అల్పాహారం పంపిణి Fri, Mar 29, 2024, 12:54 PM
శివాలయంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి Fri, Mar 29, 2024, 12:53 PM
కర్ణాటక మద్యం పట్టివేత Fri, Mar 29, 2024, 12:52 PM
కాంగ్రెస్ గూటికి సొసైటీ డైరెక్టర్ ఉపేందర్ Fri, Mar 29, 2024, 12:52 PM
యువకుని శవం లభ్యం Fri, Mar 29, 2024, 12:48 PM