కుప్పంలో ఉద్రిక్తత.. పోటా పోటీ ఆందోళనలతో రెండు పార్టీలు

by సూర్య | Fri, Oct 22, 2021, 06:57 PM

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. వైకాపా ప్రజాగ్రహ దీక్షలో పాల్గొన్న రెస్కో ఛైర్మన్‌ సెంధిల్‌ తెదేపా అధినేత చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ తెదేపా శ్రేణులు పార్టీ కార్యాలయం నుంచి పోలీస్‌స్టేషన్‌కు బయల్దేరారు. తెదేపా శ్రేణులు పట్టణంలోని ఎమ్‌ఆర్‌రెడ్డి కూడలికి చేరుకోగా... బస్టాండ్‌ వద్ద ప్రజాగ్రహ దీక్ష నుంచి వైకాపా నాయకులు కూడా కూడలి వద్దకు చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇరు పార్టీల నాయకుల అరుపులు, కేకలతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ఇరువర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో వైకాపా శాంతిపురం కన్వీనర్‌ కోదండరెడ్డి కుప్పం అర్బన్‌ సీఐ సిఐని తోయడంతో పోలీసులు వైకాపా శ్రేణులను చెదరగొట్టారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM