ఆ 2 రోజులు వారికి సెలవులు

by సూర్య | Fri, Oct 22, 2021, 06:50 PM

తమ సంస్థలో పనిచేసే మహిళల కోసం ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ మంచి నిర్ణయం తీసుకుంది. నెలసరి సమయంలో రెండు రోజులపాటు సెలవులు ప్రకటించింది. తమ వద్ద పనిచేసే డెలివరీ విమెన్‌కు ఈ సౌకర్యాన్ని కల్పించింది. పైగా ఆ సమయంలో సెలవులకోసం కారణం కూడా చెప్పాల్సిన అవసరం లేదని సంస్థ వెల్లడించింది. పీరియడ్స్ సమయంలో బయటకు రావాలన్నా.. రోడ్లపై తిరగాలన్నా మహిళలు చాలా అసౌకర్యానికి గురవుతారని, అలాంటి మహిళలకు అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు స్వీగ్గీ ఆపరేషన్స్ ప్రెసిడెంట్ మిహిర్ షా తన బ్లాగ్ పోస్ట్‌లో వెల్లడించారు. అంతేకాదు మహిళా ఉద్యోగుల కోసం మరిన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు ఆయన తెలిపారు. మహిళల భద్రత కోసం వారి పని గంటలను సాయంత్రం 6 గంటల వరకే పరిమితం చేసినట్టు తెలియజేశారు.

Latest News

 
ఉపాధ్యాయులకు సన్మానం Tue, Apr 23, 2024, 12:51 PM
టెన్త్ ఫలితాలలో సత్తా చాటిన గుంటపల్లి హైస్కూల్ Tue, Apr 23, 2024, 12:37 PM
మానవత్వం చాటుకున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ Tue, Apr 23, 2024, 12:36 PM
చంద్రబాబు ని కలిసిన బత్యాల Tue, Apr 23, 2024, 12:33 PM
అభివృద్ధి కావాలా! అరాచకం పాలన కావాలా Tue, Apr 23, 2024, 12:30 PM