వైవీ సుబ్బారెడ్డికి మంత్రి పదవి.. కొత్త టీటీడీ ఛైర్మన్ నెల్లూరు మాజీ ఎంపీ

by సూర్య | Sun, Jun 13, 2021, 11:40 AM

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని మంత్రివర్గంలో తీసుకోబోతున్నారా? ప్రస్తుతం ఏపీవ్యాప్తంగా ఇదే విషయం చర్చనీయాంశమైంది. టీటీడీ ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ఈ జూన్‌తో ముగియనుంది. సీఎం జగన్ ఆయన్నే కొనసాగిస్తారా  లేక మరెవరికైనా అవకాశం ఇస్తారా ? అనేదానిపై జోరుగా చర్చ సాగుతోంది. అయితే, త్వరలో జరిగే కేబినెట్ విస్తరణలో వైవీ సుబ్బారెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక, టీటీడీ చైర్మన్ గా నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.


2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రమంత్రివర్గం ఏర్పాటు చేసిన సమయంలో సీఎం జగన్ మంత్రి పదవులు రెండున్నర సంవత్సరాలేనని స్పష్టం చేశారు. తర్వాత రెండున్నర ఏళ్లు సీనియర్లకు అవకాశమిస్తానని ప్రకటించారు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తి చేసుకుంది. మరో ఆరు నెలల్లో మంత్రి వర్గ కూర్పు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో వైవీ సుబ్బారెడ్డికి మంత్రి పదవి ఖరారు అయ్యినట్లు తెలుస్తోంది. వైవీ సుబ్బారెడ్డిని ఎమ్మెల్సీగా చేసి తర్వాత కేబినెట్ లో తీసుకుంటారనే చర్చ జరుగుతోంది.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM