నేటి నుంచి ఏపీలో కర్ఫ్యూ వేళల్లో మార్పులు

by సూర్య | Fri, Jun 11, 2021, 12:06 PM

ఏపీలో కరోనా కట్టడికి ప్రభుత్వం కర్ఫ్యూ అమలు చేస్తోంది. ఇవాళ్టి నుంచి కర్ఫ్యూ వేళల్లో పలు మార్పులు చేసింది ఏపీ సర్కార్. ఈ నెల 20 వరకు కర్ఫ్యూ ఆంక్షలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ నుంచి సడలింపులు ఇచ్చింది. గతంలో ఈ సమయం ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు ఉండగా.. ఇప్పుడు సడలింపు సమయాన్ని మరో రెండు గంటల పాటు పెంచింది. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ అమలు కానుంది. ప్రజలు నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని జగన్‌ సర్కార్‌ హెచ్చరించింది.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM