అధిక పెట్రోల్ ధరల్లో దక్షిణాధిలో ఏపీ రికార్డులు: అచ్చెన్న

by సూర్య | Fri, Jun 11, 2021, 10:37 AM

అమరావతి: అధిక పెట్రోల్ ధరల్లో దక్షిణాధిలో ఏపీ రికార్డులు నెలకొల్పిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేతగా ధరలపై గద్ధించి.. నేడు గండుపిల్లిలా మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు. ఖజానా నింపుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజల బతుకులపై లేదా అని ప్రశ్నించారు. అభివృద్ధిలో నత్తనడక..ధరాభారంలో జట్ స్పీడ్‌లో ఉన్నారని వ్యాఖ్యానించారు. ధరాభబారం తాడేపల్లి తాబేదారుకు కనిపించడం లేదా అని నిలదీశారు. వ్యాట్ రద్దు చేసి ప్రజల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా అని మండిపడ్డారు. కేరళ ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై ఏకంగా రూ.6 తగ్గించిందని తెలిపారు. గతంలో చంద్రబాబు వ్యాట్ రూ.2 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రెండు సార్లు ధరలు పెంచారన్నారు. అదనపు సెస్ రూ.4, రోడ్డు సెస్ పేరుతో రూపాయి అధనపు బాదుడు బాదుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ డీజిల్ ధరల్లో దక్షిణాధి రాష్ట్రాల్లో ఏపీ టాప్ ఉందన్నారు. ప్రజలు అవస్థలు పడుతుంటే తాడేపల్లి రాజప్రాసాదంలో దరిద్రపు రాజకీయాలా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత జగన్ రెడ్డికి లేదని అచ్చెన్నాయుడు అన్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM