ఏపీలో కరోనా పరిస్థితులపై హైకోర్టు

by సూర్య | Thu, Jun 10, 2021, 02:17 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. కరోనా నిర్ధారణ పరీక్షలను మరింత వేగవంతం చేయాలని, ఎక్కువ పరీక్షలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కాంట్రాక్ట్ నర్సులకు నెలల తరబడి బకాయి ఉన్న వేతనాలను చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. రెమిడెసివర్ ఇంజిక్షన్లు కాలం చెల్లినవి అంటూ వచ్చిన వార్తల నేపధ్యంలో.. రెమిడెసివర్ ఇంజెక్షన్ల వినియోగ కాలపరిమితిని ఏడాదికి పెంచుతూ డీసీఐ ఇచ్చిన ఆదేశాలను కోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు ప్రభుత్వ న్యాయవాది.


కరోనా వేళ మానసిక రోగులకు ఎలాంటి వైద్యచికిత్సలు అందిస్తున్నారు? అని న్యాయస్థానం ఆరా తీసింది. మెంటల్ హెల్త్ యాక్ట్‌ను ఏ విధంగా అమలు చేస్తున్నారని ప్రశ్నించిన హైకోర్టు.. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా నియంత్రణ చర్యలపై విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.


 


ఇదే సమయంలో వృద్ధులకు వాక్సినేషన్ అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. వృద్ధులకు ఆధార్ లేకుండానే వ్యాక్సినేషన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా మెమో దాఖలు చేసిన ప్రభుత్వం.. రెండ్రోజుల్లో వృద్ధులకు వ్యాక్సినేషన్ పూర్తిచేస్తామని స్పష్టంచేసింది. దీంతో వృద్ధుల వ్యాక్సినేషన్ సమస్యకు పరిష్కారం లభించినట్లు అయ్యింది.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM