పది, ఇంటర్‌ పరీక్షలపై క్లారిటీ ఇచ్చిన ఏపీ విద్యాశాఖ మంత్రి.. ఏమన్నారంటే.?

by సూర్య | Tue, Jun 08, 2021, 04:00 PM

ఏపీలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణపై ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మంగళవారం స్పష్టత నిచ్చారు. కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే పరీక్షలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్‌ దృష్ట్యా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. మంగళవారం ప్రకాశం జిల్లా పర్యాటనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. పరీక్షలను కూడా ప్రతిపక్షం రాజకీయాలకు వాడుకోవడం హేయనీమని ఆయన విమర్శించారు. ఇతర రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేస్తే ఇక్కడా కూడా చేయాలని విపక్షాలను ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నాయా.? అని మంత్రి నిలదీశారు. అపోహలను వీడి విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. గతంలో పరీక్షలు రద్దు చేసిన కారణంగా చాలా ఇబ్బందులు వచ్చాయని ఆయన గుర్తుచేశారు. కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత అకాడమిక్ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని అన్నారు. 

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM