ప్రభుత్వం నుంచి అనుమతులు తప్ప..సహాయం లేదు: ఆనందయ్య ఆందోళన

by సూర్య | Mon, Jun 07, 2021, 12:22 PM

ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా ఔషధం పంపిణీ కొనసాగుతుందని ఆనందయ్య స్పష్టంచేశారు. ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే ఔషధం అందిస్తామని.. స్థానికేతరులు ఎవరూ కృష్ణపట్నం రావొద్దని ఆయన సూచించారు. కొన్ని ఆటంకాల వల్ల ఔషధ పంపిణీ సవ్యంగా సాగట్లేదంటూ ఆనందయ్య ఆవేదన వ్యక్తంచేశారు. పంపిణీకి వనరులు సమకూరడం లేదని.. విద్యుత్‌ సౌకర్యం, ఔషధ తయారీ యంత్ర సామగ్రి లేదని ఆనందయ్య పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులే తప్ప.. ఇప్పటివరకు సహకారం లేదని ఆనందయ్య వ్యాఖ్యానించారు. ప్రభుత్వం సహకరిస్తే అన్ని ప్రాంతాలకు ఔషధాన్ని అందిస్తామంటూ ఆయన వెల్లడించారు. అయితే మందు కోసం ఎవరూ కృష్ణపట్నం రావద్దని నియోజవర్గంలోనే పాజిటీవ్ బాధితుల ఇంటి వద్దకే మందు చేర్చాలని చూస్తున్నామని ఆనందయ్య తెలిపారు. కృష్ణపట్నంలో పూర్తి అయిన తర్వాతే తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు మందు పంపిణీ చేస్తామని తెలిపారు. మందు కావలసినవారు అధికారుల వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని ఆనందయ్య సూచించారు. కోవిడ్ నిబంధనల ప్రకారమే మందు పంపిణీ జరుగుతుందని ఆనందయ్య పేర్కొన్నారు. 

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM