ఆదివారం రోజు ఫిష్ మార్కెట్లు, మాంసం దుకాణాల వద్ద రచ్చ, రచ్చ

by సూర్య | Sun, Jun 06, 2021, 03:01 PM

కరోనాను నిర్లక్ష్యం చేయొద్దని అధికారులు ఎంత మొత్తుకున్నా ప్రజల్లో మాత్రం మార్పు కనబడటం లేదు, ఆదివారం వస్తే చాలు ఫిష్ మార్కెట్లు, మాంసం దుకాణాల వద్ద క్యూ కడుతున్నారు జనాలు. ఆదివారం ఫిష్ మార్కెట్లు మూసి వేయాలన్న అధికారుల ఆదేశాలు వ్యాపారులు బేఖాతర్‌ చేస్తున్నారు. జూన్‌ 6న ఆదివారం హైదరాబాద్‌లోని రాంనగర్‌కు ఫిష్‌మార్కెట్‌ జనం రద్దీతో కిటకిటలాడింది. అలాగే అటు ఏపీలోనూ ఫిష్‌ మార్కెట్లు కిటకిట లాడాయి. గత మూడు ఆదివారాలు విజయవాడలో అన్ని చేపల మార్కెట్లను మూసివేశారు. తెచ్చిన సరుకు అమ్ముడు పోక నష్టపోయాం అంటూ చేపల వ్యాపారులు గగ్గోలు పెట్టారు. వ్యాపారస్తులను దృష్టిలో పెట్టుకొని ఉ 6 గంటల నుంచి 10 గం వరకు చేపల మార్కెట్లకు పర్మిషన్ ఇచ్చారు. అయితే నగరంలో మిగతా వ్యాపారస్తుల్లాగే 12 గంటల వరకు అమ్మకాలకు సమయం ఇవ్వాలంటున్నారు చేపల వ్యాపారస్థులు.


ఇటు విశాఖపట్నంలోని గాజువాక మార్కెట్లో కోవిడ్ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారు. విచ్చలవిడిగా చేపల విక్రయాలు చేపట్టారు. జీవీఎంసీ అధికారుల ఆదేశాలకు విలువే లేకుండా పోయింది. వాస్తవానికి మాంసం, చేపల విక్రయాలను ఆదివారం నిలిపివేశారు అధికారులు. ఈ అవకాశాన్ని కొద్దిమంది వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. అధికారుల ఆదేశాలను బేఖాతర్‌ చేస్తూ చేపలను విక్రయించారు. మాంసం దొరక్కపోవడంతో చేపలకోసం ఎగబడ్డారు. దీంతో కరోనా మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM