రేప‌టి నుంచి ఆనంద‌య్య మందు పంపిణీ..!

by సూర్య | Sun, Jun 06, 2021, 12:03 PM

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆనందయ్య త‌యారు చేస్తోన్న క‌రోనా మందు పంపిణీకి ఏర్పాట్లు పూర్త‌య్యాయి. రేప‌టి నుంచే మందు పంపిణీ చేస్తామని ఆనందయ్య తెలిపారు. ముందుగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు అందిస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఆ త‌ర్వాత మిగతా ప్రాంతాల్లో పంపిణీ చేయాలని నిర్ణయించామని తెలిపారు. అయితే, ఔష‌ధ‌ పంపిణీ కోసం రూపొందించిన వెబ్‌సైట్‌తో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని ఆయ‌న చెప్పారు. దీనిపై  రాజకీయాలు చేయ‌కూడ‌ద‌ని  ఆయ‌న చెప్పారు.


కాగా, ఈ ఔష‌ధానికి ‘ఔషధచక్ర’ అని పేరు పెట్టారు. ఆ మందు త‌యారీ పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. కృష్ణ‌ప‌ట్నం పోర్టు వ‌ద్ద దీన్ని త‌యారు చేస్తున్నారు. ఇందుకోసం కృష్ణపట్నం పోర్టుకు చెందిన సీవీఆర్‌ కాంప్లెక్స్‌ను వాడుకుంటున్నారు. మొదట సర్వేపల్లి నియోజకవర్గంలో లక్షమందికి కరోనా రానివారు వాడే మందును అందజేయాలని ఆనంద‌య్య బృందం ఇప్ప‌టికే నిర్ణ‌యించింది. అనంత‌రం కరోనా రోగులకు అవసరమైన మందును పంపిణీ చేస్తారు. ఆ త‌ర్వాతే ఇతర ప్రాంతాల‌కు పంపిణీ చేయ‌నున్నారు.

Latest News

 
పేపర్ మిల్‌కు లాకౌట్ Thu, Apr 25, 2024, 04:52 PM
ఈనెల 28న జగ్గంపేటలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Thu, Apr 25, 2024, 04:50 PM
రైల్వే ప్రాజెక్టులకు ప్రభుత్వం భూములు ఇవ్వలేదు Thu, Apr 25, 2024, 04:49 PM
ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా Thu, Apr 25, 2024, 04:47 PM
ఇంటిలిజెన్స్ చీఫ్ గా నూతన నియామకం Thu, Apr 25, 2024, 04:46 PM