నకిలీ సైట్ క్రియేట్ చేసి ఆనందయ్య మందుతో రూ.120 కోట్లకు స్కెచ్ : సోమిరెడ్డి

by సూర్య | Sat, Jun 05, 2021, 04:30 PM

కృష్ణపట్నం ఆనందయ్య మందు చరిత్రాత్మక ఘటన అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆనందయ్య మందు పేరుతో సోమ్ము చేసుకోవాలని ఎమ్మెల్యే కాకాణి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మే 21 నుండి ఆనందయ్య మందును క్యాష్ చేసుకోవాలన్న కుట్రలు ప్రారంభమయ్యాయని తెలిపారు. శ్రేషిత టెక్నాలజీ వద్ద సైట్‌కొని ఇంటర్నెట్‌లో హోస్ట్ చేసి వెంటనే డిలీట్ చేసినట్లు చెప్పారు. శ్రేషిత కంపెనీలో డైరెక్టర్లు వైసీపీ నాయకులని అన్నారు. సైట్‌లో రూ.15 పెట్టి ప్రజలకు అందుబాటులోకి వచ్చేసరికి రూ.167 చేశారని మండిపడ్డారు. ఆనందయ్య ఆవేశంతో వెనక్కి తీసుకున్నారని..ఆనందయ్య కుమారుడు సెల్ఫీ వీడియోతో ఎమ్మెల్యే కాకాణి కంగుతిన్నారని అన్నారు. ఇంకా ఆనందయ్యకి స్వేచ్ఛ రాలేదని తెలిపారు. తెలంగాణ నుండి సన్మానించడానికి యాదవ సంగం వాళ్ళు వస్తే పోలీసులతో తరిమిచ్చారని మండిపడ్డారు. ఆనందయ్య మందు పంపిణీకి పర్మిషన్ ఇవ్వమని కోర్టుకి వెళ్తే ప్రభుత్వ లాయర్ అడ్డుకున్నారన్నారు.


కోటి మందికి ఆన్‌లైన్‌లో మందు అమ్మి రూ.120 కోట్లు సొమ్ము చేసుకునేందుకు కాకాణి కుటిల ప్రయత్నం చేశారని సోమిరెడ్డి ఆరోపించారు. నకిలీ సైట్ క్రియేట్ చేసిన వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆనందయ్య మందుకు ఫ్యాను గుర్తు పెట్టడం ముఖ్యమంత్రిని దిగజార్చడమే అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే చేస్తున్న ఆగడాలను నిలదీసే దమ్ము, ధైర్యం జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, ఎస్పీ, కలెక్టర్‌లకు లేదన్నారు. సుమోటోగా కుట్రపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే.. తాము మోమోరాండం ఇవ్వడానికి సిద్ధమని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.

Latest News

 
వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి Fri, Mar 29, 2024, 12:18 PM
ఎన్ని కష్టాలు వచ్చినా టీడీపీ వెంటే పరిటాల కుటుంబం: సునీత Fri, Mar 29, 2024, 12:09 PM
సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ రెండు రోజులుగా తనిఖీలు Fri, Mar 29, 2024, 12:06 PM
పూర్తి స్థాయిలో అమలు కానీ ఎన్నికల కోడ్ Fri, Mar 29, 2024, 12:05 PM
వృద్ధాప్య పెన్షన్ 3 వేల నుంచి 4 వేలకు పెంచుతాం: చంద్రబాబు Fri, Mar 29, 2024, 12:04 PM