లైంగిక వేధింపుల ఘటనలో నెల్లూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ పై వేటు

by సూర్య | Sat, Jun 05, 2021, 04:00 PM

లైంగిక వేధింపుల ఘటనలో నెల్లూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ బాధ్యతల నుంచి ప్రభాకర్‌ను తొలగించారు. తిరుపతి రుయా ఆసుపత్రికి ఆయనను బదిలీ చేశారు. కాగా జీజీహెచ్ ఘటనపై రెండు కమిటీలు విచారణ చేపట్టిన సంగతి విదితమే. డీఎంఈ త్రిసభ్య కమిటీ, డిస్ట్రిక్ట్ త్రిసభ్య కమిటీలు లైంగిక వేధింపుల ఘటనపై లోతుగా దర్యాప్తు చేశాయి. ఈ క్రమంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించగా.. ఆయనను నెల్లూరు జీజీహెచ్‌ బాధ్యతల నుంచి తొలగించారు. కాగా, ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌ అయిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపులపై మహిళా కమిషన్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. సూపరింటెండెంట్‌ లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిపి పూర్తి నివేదిక ఇవ్వాలని మంత్రి ఆళ్ల నాని శుక్రవారం ఆదేశించారు. విచారణ చేపట్టిన రెండు కమిటీలు.. ప్రభుత్వానికి నివేదిక సమర్పించాయి.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM