కరోనా సోకిన ప్రకాశం జిల్లా పీహెచ్‌సీ డాక్టర్.. చికిత్స కు రూ. కోటి విడుదల చేసిన సీఎం జగన్

by సూర్య | Sat, Jun 05, 2021, 12:16 PM

ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు.  శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కొత్తపుట్టుగకు చెందిన డాక్టర్‌ ఎన్‌.భాస్కరరావు ప్రకాశం జిల్లా కారంచేడు పీహెచ్‌సీ వైద్యాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నతాధికారుల ఆదేశాలతో సుమారు 6 వేల మందికి కరోనా టెస్టులు చేశారు. పాజిటివ్‌గా తేలిన వారికి చికిత్స అందించి.. వారికి ధైర్యం నూరిపోశారు. ఆయన అందించిన వైద్యంతో వేలాది మంది కోవిడ్‌ బారినుంచి కోలుకున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్‌ 24న ఆయనకు కరోనా సోకింది. నెలాఖరు వరకు హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండి వైద్యం పొందారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో భార్య డాక్టర్‌ భాగ్యలక్ష్మి ఆయనను విజయవాడ ఆయుష్‌ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ 10 రోజుల ట్రీట్మెంట్ అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ యశోదా ఆస్పత్రి, తరువాత గచ్చిబౌలిలోని కేర్‌ హాస్పిటల్‌కి తరలించారు. ఊపిరితిత్తులు పూర్తిగా డ్యామేజ్ అవ్వడంతో.. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలుగుతుండటంతో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఆయనకు ఊపిరితిత్తులు మార్చాలని తేల్చిన వైద్యులు అందుకు రూ.1.50 కోట్లకు పైగా ఖర్చవుతుందని చెప్పారు. 


అయితే  ఈ విషయం సీఎం జగన్‌ కి  తెలియడంతో స్పందించిన సీఎం జగన్ వెంటనే కోటి విడుదల చేశారు.  అవసరమైతే మిగిలిన 50 లక్షలు కూడా అందజేసేందుకు ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు మంత్రి బాలినేని వారికి తెలిపారు. డాక్టర్‌ బాస్కర్‌రావు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని వారికి భరోసా కల్పించారు. భాస్కరరావు కుటుంబసభ్యులు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Latest News

 
కూటమి వస్తే మహిళలకు ఆర్‌టీ సీ బస్సుల్లో ఉచితం Tue, Apr 16, 2024, 03:46 PM
ఈ ఏడాది వర్షాలు ఎక్కువే Tue, Apr 16, 2024, 03:45 PM
మానవత్వం మరిచిన మాతృమూర్తి Tue, Apr 16, 2024, 03:44 PM
జనసేనకు జతకట్టిన గాజు గ్లాస్, హమ్మయ్య అంటున్న జనసేన Tue, Apr 16, 2024, 03:44 PM
దోపిడీకి ప్రణాళికలు రచిస్తున్నారు Tue, Apr 16, 2024, 03:43 PM