డీఎంహెచ్‌వో ఆమోదిస్తే ఆనందయ్య చుక్కల మందు వేస్తాం

by సూర్య | Sat, Jun 05, 2021, 09:40 AM

జిల్లా వైద్యాధికారి  "డీఎంహెచ్‌వో"  ఆమోదిస్తే.. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కరోనా బాధితులకు చుక్కల మందు వేస్తామని ఆనందయ్య తరఫు న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ హైకోర్టు ముందు శుక్రవారం ప్రతిపాదన చేశారు. కంటి చుక్కల మందు విషయంలో స్టెరిలిటీ పరీక్ష అత్యంత త్వరగా నిర్వహించాలన్నారు. ఆ ఫలితం వచ్చేవరకు చుక్కల మందు వేయకుండా ఉండేందుకు అభ్యంతరం లేదన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది "ఎ్‌సజీపీ" సి.సుమన్‌ స్పందిస్తూ.. చుక్కల మందు వేయమని డీఎంహెచ్‌వో సిఫారసు చేయలేరని, పరీక్ష ఫలితం వచ్చిన తరువాతే ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తులు జస్టిస్‌ కె.విజయలక్ష్మి, జస్టిస్‌ డి.రమేశ్‌తో కూడిన ధర్మాసనం ఈ వ్యవహారంలో తగిన ఉత్తర్వులు ఇస్తామని పేర్కొంది.

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM