నేడు కేరళ తీరాన్ని తాకనున్న ఋతుపవనాలు

by సూర్య | Thu, Jun 03, 2021, 04:00 PM

ఋతుపవనాలు ఇవాళ కేరళ తీరాన్ని తాకనున్నాయి. జూన్ రెండవ వారంలో రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అల్పపీడన ద్రోణి ప్రభావం మరో రెండు రోజులు ఉంటుందని, రాబోయే 24 గంటల్లో తెలంగాణలో ఓ మోస్తరు భారీ వర్షాలు పడతాయని నిపుణులు చెబుతున్నారు. గత ఏడాదిలా ఈసారి విపత్కర పరిస్థితులు ఉండకపోవచ్చునని హైదరాబాద్ వాతావరణ అధికారి నాగరత్నం అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేరళలో నైరుతి గాలులు బలపడ్డాయని, దీంతో కేరళ ప్రాంతాలో చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రాంతంలో జూన్ రెండో వారంలో వర్షాలు వచ్చే అవకాశం ఉందని  అన్నారు. వాస్తవానికి జూన్ 1న  ఋతుపవనాలు కేరళలో ప్రవేశించాల్సి ఉండగా... వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రెండు రోజులు ఆలస్యంగా వస్తున్నాయన్నారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM