విశాఖ నావల్ డాక్ యార్డ్ అడ్మిరల్ సూపరింటెండెంట్ గా ఐ.బి. ఉత్తయ్య..

by సూర్య | Tue, Jun 01, 2021, 03:57 PM

విశాఖపట్నం, నావల్ డాక్ యార్డ్, అడ్మిరల్ సూపరింటెండెంట్ గా, రియర్ అడ్మిరల్ ఐ.బి. ఉత్తయ్య, వి.ఎస్.ఎమ్. రియర్ అడ్మిరల్ కుమార్ నాయర్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. రియర్ అడ్మిరల్ ఐ.బి. ఉతయ్య, వి.ఎస్.ఎమ్.1987, నవంబర్ నెలలో భారత నావికాదళంలో చేరారు. అడ్మిరల్ ఐ.బి. ఉతయ్య, మెరైన్ ఇంజనీరింగ్‌లో బి.టెక్. డిగ్రీ, గణిత మోడలింగ్ , కంప్యూటర్ సిమ్యులేషన్‌లో ఎం.టెక్ డిగ్రీతో పాటు స్ట్రాటజిక్ స్టడీస్‌ లో ఎం. ఫిల్. డిగ్రీని కలిగి ఉన్నారు. 33 ఏండ్ల సర్వీసులో, అడ్మిరల్ ఐ.బి. ఉతయ్య, భారత నావికాదళానికి చెందిన, యుద్ధ నౌకల రూపకల్పన డైరెక్టరేట్, శిక్షణ అకాడమీ లు, నావల్ డాక్ యార్డ్, కమాండ్, నావల్ ప్రధాన కార్యాలయాలలో వివిధ హోదాల్లో సేవలందించారు. యుద్ధనౌక రూపకల్పన, నిర్మాణం, స్వాధీనం చేసుకోవడం; యుద్ధ నౌకల నిర్వహణ; మరమ్మత్తు; శిక్షణ; భారీ నౌకల ప్రాజెక్టు యాజమాన్యం; సివిల్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు మొదలైన విభాగాల్లో ఆయన కీలక పదవులు నిర్వహించారు. 

Latest News

 
పేపర్ మిల్‌కు లాకౌట్ Thu, Apr 25, 2024, 04:52 PM
ఈనెల 28న జగ్గంపేటలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Thu, Apr 25, 2024, 04:50 PM
రైల్వే ప్రాజెక్టులకు ప్రభుత్వం భూములు ఇవ్వలేదు Thu, Apr 25, 2024, 04:49 PM
ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా Thu, Apr 25, 2024, 04:47 PM
ఇంటిలిజెన్స్ చీఫ్ గా నూతన నియామకం Thu, Apr 25, 2024, 04:46 PM