నేటి నుంచి వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీ.. మూడు రోజుల్లో పంపిణీ పూర్తి

by సూర్య | Tue, Jun 01, 2021, 10:28 AM

వైఎస్సార్‌ పెన్షన్ కానుక పంపిణీకి ప్రభుత్వం సర్వం సిద్దం చేసింది. దీని ద్వారా రాష్ట్రంలో 61.46 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. ఈ నెలలో కొత్తగా 29,961 మంది అర్హులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నారు. మే నెల పెన్షన్ మొత్తాలను జూన్ 1వ తేదీన నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దే, వారి చేతికి అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పంలో భాగంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మంగళవారం (జూన్ 1వ తేదీ) తెల్లవారుజాము నుంచే వలంటీర్లు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు.


ఈ మేరకు పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.1497.62 కోట్ల రూపాయలను ఇప్పటికే విడుదల చేసింది. ఈ మొత్తాలను గ్రామ, వార్డు సచివాలయాలకు పంపిణీ చేశారు. సచివాలయాల ద్వారా వలంటీర్లు పెన్షనర్లకు వారి ఇంటి వద్ద, నేరుగా పెన్షనర్ల చేతికే పెన్షన్ మొత్తాలను అందచేస్తారు. ఇందుకోసం 2.66 లక్షల మంది వలంటీర్లు పని చేస్తున్నారు. లబ్ధిదారులకు పెన్షన్ అందచేసే సందర్భంలో గుర్తింపు కోసం బయోమెట్రిక్, ఐరిస్ విధానాలను అమలు చేస్తారు.


అలాగే ఆర్‌బిఐఎస్ విధానంను కూడా అందుబాటులోకి రానుంది. ఈ రెండు విధానాల్లో పెన్షనర్ల గుర్తింపు సాధ్యం కాకపోతే అంతకు ముందే వారి కుటుంబసభ్యులు నమోదు చేయించుకున్న ఆథరైజ్డ్ బయోమెట్రిక్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటారు. సాంకేతిక కారణాల వల్ల ఏ ఒక్కరికీ పెన్షన్ అందలేదనే ఫిర్యాదు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. పెన్షన్ మొత్తాలను మూడు రోజుల్లో నూరుశాతం పంపిణీ పూర్తి అయ్యేలనే టార్గెట్‌ పని చేస్తున్నారు. పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో 15వేల మంది వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్, వార్డు వెల్ఫేర్ డెవలప్‌మెంట్ సెక్రటరీలు భాగస్వాములు అవుతున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల డిఆర్‌డిఎ కార్యాలయాల్లోని కాల్ సెంటర్ల ద్వారా పెన్షన్ల పంపిణీని పర్యవేక్షిచనున్నారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM