ఆనందయ్య మందు పంపిణీ పై మరికాసేపట్లో వీడనున్న సస్పెన్స్.. హైకోర్టు కొనసాగుతున్న విచారణ

by సూర్య | Mon, May 31, 2021, 01:11 PM

కృష్ణపట్నం ఆనందయ్య తయారు చేసిన కరోనా మందును.. ప్రభుత్వమే పంపిణీ చేయాలంటూ దాఖలైన పిటిషన్​పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. 4 రోజులు సమయమిచ్చినా పంపిణీ వివరాలు ఎందుకు సమర్పించలేదని హైకోర్టు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మందు పంపిణీకి సంబంధించి చేపట్టిన చర్యల వివరాలను తమ ముందుంచాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆనందయ్య నాటు మందుపై కాసేపట్లో ప్రభుత్వం సమీక్ష జరుపుతుందని గవర్నమెంట్ తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ సమీక్ష తర్వాత నిర్ణయం తమకు తెలపాలని ఆదేశించిన న్యాయస్థానం.. మధ్యాహ్నం తీర్పు వెల్లడిస్తామని చెప్పింది. విచారణను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేసింది. మలికార్జున, ఉమామహేశ్వరరావు అనే వ్యక్తులు ఈ వ్యాజ్యం వేశారు. తిరిగి ఆనందయ్య మందు పంపిణీ ఉంటుందా లేదా అన్న సస్పెన్స్ మరికాసేపట్లో వీడనుంది.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM